సూళ్లూరుపేట, చిత్తూరు ఎక్స్ ప్రెస్ మార్చి 27:
విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు ఆర్థిక, ఉద్యోగ సహాయం పొందించారు. కారుణ్య నియామకం ద్వారా ఒక మృతుడి సతీమణికి ఉద్యోగ ఆదేశాలు అందజేశారు. మిగిలిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాల అవస్థలు తెలిసి ఎస్పీ సహాయం పొందించారు. ఈ సహాయం కుటుంబాలకు భవిష్యత్తు భద్రత కల్పిస్తుందని అధికారులు తెలిపారు.