chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 11:19 am Digital Edition : CHITTOORE EXPRESS

హైదరాబాద్‌లో మంజుల పత్తిపాటి గారిని కరణం బ్రాహ్మణ సంఘం సత్కరించింది

 

హైదరాబాద్,చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,ఫిబ్రవరి 12:

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి గారిని కరణం బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు సమకాలీన సామాజిక అంశాలు, మానవీయ విలువలపై అందమైన కవితలు రచిస్తున్నందుకు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.సంఘం రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంజుల పత్తిపాటి గారి కవితలు సమాజంలో మానవతా విలువలను ప్రచారం చేస్తూ, సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాయని ప్రశంసించారు. వారి సాహిత్య సేవలు గొప్పదని, ఇలాంటి కవులు మరిన్ని మంది ఉత్పత్తి కావాలని అన్నారు.శ్రీమతి మంజుల పత్తిపాటి గారు స్పందిస్తూ, తమ కవితల ద్వారా సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రాస్తున్నానని, ఈ సత్కారం తనకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సాహిత్య ప్రముఖులు, స్థానికులు భాగస్వాములుగా పాల్గొన్నారు.