కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 25:
స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పలు గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. కుప్పం డిగ్రీ కాలేజ్ లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు. గుడిపల్లి మండలం పెద్ద కోటమకనపల్లి గ్రామంలో పర్యటించిన మహిళలతో సమావేశమయ్యారు.
*వినూత్న ఆలోచనలతోనే నూతన ఆవిష్కరణలు*
*కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి. భవిష్యత్ పై స్పష్టత ఉండాలి. యువత స్వశక్తితో ఎదగాలి. కష్టాన్ని నమ్ముకోవాలి. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాడు విజన్ 2020, నేడు విజన్ 2047 లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తే ఏం జరిగిందో గత ఐదేళ్లలో మనం చూశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు. ప్రజల కోసం నిలబడతారు. నేను ఏం చేయగలనో అదే హామీ ఇస్తానని చంద్రబాబు గారు నాతో చెబుతూ ఉంటారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. గృహిణిగా ఉన్న నేను హెరిటేజ్ బాధ్యతలను సవాల్ గా తీసుకున్నాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి దానికీ అసంతృప్తికి లోను కాకూడదు. కష్టపడి పనిచేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారు. ప్రయోజకులు కావాలని , భవిష్యత్ బాగుండాలని తాపత్రయపడతారు. పిల్లలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులే. చంద్రబాబు గారు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నా కుమారుడు లోకేష్ పెంపకం, చదువు బాధ్యత నేనే చూసుకున్నాను. ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పి పెంచానని నారా భువనేశ్వరి అన్నారు. జాబ్ మేళా సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో భువనేశ్వరి సమావేశమాయ్యారు.
*పరిశ్రమల రాకతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు*
గుడిపల్లి మండలం పెద్ద కోటమకనపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి గారు మహిళలతో సమావేశమయ్యారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు గారిని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బిజీగా ఉండటంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ప్రజల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నాను.రాష్ట్రాన్ని బాగుచేయడం చంద్రబాబు గారి వల్లే సాధ్యమని ప్రజలు నమ్మి ఓటేశారు. కుప్పం నియోజకవర్గానికి రూ. 7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమలు తీసుకొచ్చారు. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్ వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో సోలార్ ఎనర్జీ వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కుప్పం డిగ్రీ కాలేజ్ లో జాబ్ మేళా సందర్భంగా 5 వేల ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద 37, 824 మంది లబ్ధి పొందుతున్నారు. 42, 232 మందికి తల్లికి వందనం అందుతోంది. స్వచ్ఛ కుప్పంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. స్వర్ణ కుప్పంలో భాగంగా సీసీ, బీటీ రోడ్లు వేస్తున్నారు. సంజీవని హెల్త్ క్లినిక్స్ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారు. కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారు. గతంలో కొందరు చంద్రబాబు గారిపై నిందలు మోపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. యావత్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారికి అండగా నిలబడ్డారు. మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోరాడారని నారా భువనేశ్వరి అన్నారు. అంతకుముందు స్థానిక మహిళలతో కలిసి నారా భువనేశ్వరి కోలాటం ఆడారు.