శ్రీకాళహస్తి స్వచ్ఛ స్వర్ణముఖి ఉద్యమంలో భాగంగా
సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పరిసర ప్రాంతంలో విస్తృత స్థాయిలో స్వర్ణముఖి నది ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా నదీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు,ముళ్లకంపలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించి నది పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, నదుల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి.కె. వెంకటేశులు మాట్లాడుతూ స్వర్ణముఖి నదిని పరిశుభ్రంగా పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ , దేవస్థానం బోర్డు సభ్యురాలు కోలా విశాలాక్షి . దేవస్థానం బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి , ప్రత్యేక ఆహ్వానితురాలు శైలజ , దేవస్థానం అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

