
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 29:
కుప్పం ఇంజనీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చాటారు. జూన్ నెలలో నిర్వహించిన బీటెక్, ఎంబీఏ వివిధ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం కళాశాల యాజమాన్యం విడుదల చేసింది. బీటెక్ ఆర్–24 రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీతో పాటు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ, ఎంబీఏ ఆర్–24 రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ప్రకటించారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరీక్షల పరిశీలకులు ప్రొఫెసర్ డాక్టర్ వి.బి.చిత్ర, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సుధాకర్ బాబు,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.భాస్కరన్, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె.మాధవన్, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఎన్.మునీంద్ర, పరీక్షల నియంత్రణాధికారి ఎం.సోమసుందరం సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు. బీటెక్‌లో శ్రేయకు ప్రథమ స్థానం బీటెక్ ఆర్–24 రెండో సెమిస్టర్ ఫలితాల్లో సీటీఎస్ (డేటా సైన్స్) విభాగానికి చెందిన ఎన్.శ్రేయ 94 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. అదే విభాగానికి చెందిన వి.మౌనిక 91.6 శాతం మార్కులతో ద్వితీయ స్థానం సాధించగా, ఈసీఈ విభాగానికి చెందిన ఎం.చిత్ర 94.8 శాతం మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ఎంబీఏలో మాధవి అగ్రస్థానం ఎంబీఏ ఆర్–24 రెండో సెమిస్టర్‌లో కె.మాధవి 85.5 శాతం మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బి.పి.దివ్యశ్రీ 85.38 శాతం మార్కులతో ద్వితీయ స్థానం,ఎ.అక్షయ 84.88శాతం మార్కు లతో తృతీయ స్థానం సాధించారు. కళాశాలలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు డిస్టింక్షన్, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి ఈ సందర్భంగా బీసీఎన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ బి.సి.నాగరాజ్ మాట్లాడుతూ సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరింతఉన్న తలక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా వనరులు, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు చక్కటి ప్రణాళికలు రూపొందించుకోవా లని ఆకాంక్షించారు. ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారికి మార్గనిర్దేశం చేసిన అధ్యాపకులను బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.సి.నాగరాజ్, కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్.సునీల్‌రాజ్, కార్యదర్శి ఎన్.సాగర్‌రాజ్, విభాగాధిపతులు అభినందించారు.