శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 2న శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి తెలిపారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది కార్యకర్తలతో ఏపీ సీడ్స్ నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.యూత్ వింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు పవన్‌కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలను కార్యకర్తలకు తెలియజేసేందుకు ఎల్‌ఈడీ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం కార్మికులకు అల్పాహారం, రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు, అన్నదానం, పట్టణంలోని మూడు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు జయప్రకాష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
