chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:59 am Digital Edition : CHITTOORE EXPRESS

సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 29 :

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎంతో చర్చించారు. అనంతరం ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమానికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ ఆశ్రమంలో ఇటీవల వెలుగుచూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, వివాదాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఆశ్రమ ప్రతిష్ఠను కాపాడడంతో పాటు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేలా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోలా ఆనంద్ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా శ్రీవ్యాసాశ్రమా నికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆశ్రమ గౌరవాన్ని పరిరక్షించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోలా ఆనంద్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.