
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే24:
సాయి మాత సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో బెంగళూరుకు చెందిన శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆదివారం కుప్పం ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో మెగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ కంటి సమస్యలను పరీక్షించించుకున్నట్టు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ బాబు తెలిపారు. మొత్తం సుమారు 220 మంది కంటి రోగులను వైద్యులు పరీక్షించగా, వారిలో 52 మందిని కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికైన వారికి బెంగళూరులోని శంకర కంటి ఆసుపత్రిలో సోమవారం ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని స్థానికులు అభినందించారు.