chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 10:12 am Digital Edition : CHITTOORE EXPRESS

సర్ కార్యక్రమం 

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 13:

 

శ్రీకాళహస్తి రాజ్యాంగబద్ధ సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం ప్రచురించే ఓటర్ల జాబితాలోని తప్పొప్పులను సరిచేసి, నూతన ఓటర్ల చేర్పు , అనర్హుల తొలగింపు చేసి పారదర్శకమైన, సవివరమైన జాబితా సిద్ధం చేయడానికి ఉద్దేశించి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం ప్రజలందరి కోసం అని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే సర్ -2026 కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 294 బూత్ ల పరిధిలో బిఎల్ఓ లు , గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు నిర్వహించాల్సిన పాత్రపై శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రాజకీయ పార్టీల బిఎల్ఏ లతో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి , ఆర్డీవో భానుప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు సర్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల నుండి తెలుసుకోవడమే కాక, అందులో ఎదురయ్యే కొన్ని అవాంతరాలను కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి మార్గాలు సూచించమని విన్నవించడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా కీర్తింపబడుతున్న భారతదేశంలో చట్టసభలకు ఎన్నికల నిర్వహణ మరియు వాటి పర్యవేక్షణకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమీషన్ చూసుకుంటుందని. అటువంటి ఎన్నికల కమీషన్ రూపొందించిన ఎన్నికల ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా సిద్దం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమే సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని, దీనిలో పౌరులందరూ బాధ్యతగా పాల్గొని సహకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, వన్నెకుల క్షత్రియ సంక్షేమం , అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, రాష్ట్ర కార్యదర్శి యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా, క్లస్టర్ ఇన్‌ఛార్జి కంఠా రమేష్, గోపీనాథ్, పేట బాలాజీ, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, డిల్లీ బాబు, యూనిట్ ఇన్‌ఛార్జి రామకృష్ణ యాదవ్, వినయ్, కిట్టు, కె.వి.ప్రతాప్, భగత్, నాగరాజు, భాస్కర్, మధు, రాకేష్, సుప్రజ, మురళి, మీర్జా తదితరులు పాల్గొన్నారు.