chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 10:31 am Digital Edition : CHITTOORE EXPRESS

సకాలంలో గ్యాస్ అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గ్యాస్ డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు వదంతులు నమ్మకండి మీ పరిధిలో గ్యాస్ పుష్కలంగా దొరుకుతుంది అంటూ సూచనలు చేసిన సీఐ

గంగవరం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి14:

 

 

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గం గంగవరం మండలం హెచ్ పి గ్యాస్ డీలర్స్ తో ప్రజలువాగ్వాదం పెట్టుకున్నా రు. దీంతో గ్యాస్ గోడౌన్ డీలర్ షట్టర్ దించి తాళాలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతాని కి చేరుకొని ప్రజలకు నచ్చ చెప్పారు. బాధితులు మాట్లాడుతూ…ఐదు నుండి పదిరోజుల వ్యవధి అవుతున్న తమకు ఇంతవరకు గ్యాస్ అందలేదు అంటూ ఇంట్లో చిన్నపిల్లలు వృద్దులు ఉన్నారు, ఎలా తినేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఉంది మీ ఇళ్ల వద్దకే పంపిస్తామంటూ బుకాయిస్తున్నారు. సంబంధించిన అధికారులు తమకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాల్సింది గా డిమాండ్ చేశారు. సీఐ రాంభూపాల్ మాట్లాడుతూ… గ్యాస్ కొరత అనేది అబద్ధం ఓటిపి వచ్చిన వారి ఇళ్ల వద్దకే గ్యాస్ అందేలా డీలర్స్ తో మాట్లాడడం జరిగింది. వదంతులను నమ్మకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.