
భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,మార్చి 26:
జనకాత్మజా జానకీ జగదంబ రూపిణి జ్యోతిర్మయి, శుభలక్షణ శోభితాంగి శశిముఖి శాంతస్వరూపిణి; రఘువంశ తిలకుడైన రాముని హృదయరత్నమై, భువనమంత వెలుగొందె భక్తజన పావన సౌభాగ్యము!మృదుమందహాస విహారిణి మానస సరస్సు కమలమై, మంగళ గుణగణ గర్భిణి మాతృస్వరూపిణి మాధుర్యమై; అరణ్యాంతర గాఢవిపినమున అనుబంధమై నిలిచినది, అనురాగ దీప్తి సాక్షిగా అచంచల సత్యసంకల్పమై! రామోవిగ్రహవాన్ ధర్మో రమణీయ గుణసాగరో, సీతా సహచర్యమున్ సదా సౌమ్యమూర్తి సుపావనుడు;సముద్రం సైతం సంభ్రమించు శౌర్య గంభీర వైభవం, సేతుబంధ కీర్తి సాక్షిగా సాగరమే స్తుతించెను! విరహాగ్ని వేడిలోనూ విశ్వాస దీప్తి మాయంకాక, సీతా హృదయం సత్యసింధు స్ఫటికమై నిలిచెను; రాముని నామస్మరణే రక్షణమై మార్గదర్శిగా, ధర్మదీపికగా దివ్యదాంపత్య గాథను నిలిపెను!అశోకవాటికలో ఆర్తిగా నిలిచిన ఆ మంగళ రూపం, అమృతధారల కన్నీరై ఆకాశమున్ పలికె గాథ; ఆ దుఃఖ గాఢతను చీల్చి ఆంజనేయుని దర్శనముతో, ఆశల చిగురులు విరిసె ఆత్మవిశ్వాస సాక్షిగా! లంకాపురి లయగర్జనలో రామబాణ జ్వాలలతో, దశముఖ దర్ప దహనమై ధర్మజయం ఘోషించగా; సీతా రాముల కలయికలో సర్వలోక మంగళ గానం, సత్యసంధాన సౌభాగ్యమై సకలజన హృదయముల నిండె! శ్రీరామ సీతల నామమిదే శాశ్వత మంత్రస్వరూపము, చిత్తశుద్ధి చెలిమెలై చిగురించే చైతన్య దీపము; భక్తి పరవశ తరంగిణిలో భవసాగరము దాటించు, పరబ్రహ్మ సాక్షాత్కార పథమిదే పావన సత్యము చైత్రమాస శుక్లపక్ష నవమి పుణ్యకళ్యాణ పర్వదినంబున, సేవాసౌభాగ్య సుధాసింధువై నా చిత్తమున్ పరిపూర్ణమై; మంజుల పత్తిపాటి మృదులకరాంబుజము లందు శ్రీ సీతారామ కల్యాణ కృత్యము సుగంభీరమై సాగుచుండగా, కరుణామయ! కటాక్ష కృపాప్రవాహమే కలిగించితివి ఈ మహాభాగ్యమున్ రామయ్య! భక్తి పరవశ హృదయంతో శరణాగతి సమర్పించగా, జన్మార్థక పరమసాఫల్యమై జయనినాదములై విరిసె! శ్రీసీతారామ చరణారవింద సేవాసుధా ప్రసాదమున్ స్ఫూర్తి సింధువై, మంజుల కలమున్ కళామాత కృపతో పద్యరత్నాల వికాసమై; భక్తహృదయ భావసుమాల వాక్సుధా ప్రవాహమున్ వెలిగించగా, సీతారామ కటాక్షమే ధన్యజీవిత సత్యమై నిలిచె! శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ
శుభాకాంక్షలు!రచన: మంజుల పత్తిపాటి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, చరవాణి 9347042218 యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం.