
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 01:
శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు గవర్నర్ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టత, పూజా కార్యక్రమాల వివరాలను అధికారులు గవర్నర్‌కు వివరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బీకే వెంకటేశులు, ఏఈవోలు విద్యాసాగర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు మొక్కపాటి వెంకట్రామనాయుడు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.