శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు మడగల సాయి ఆకస్మికంగా మరణించడం అత్యంత బాధాకరం. మంగళవారం వారి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు వారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి,అత్తమ్మ సామాను అనసూయమ్మ మరియు కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డిలు కూడా అంత్యక్రియలో పాల్గొన్నారు.
మడగల సాయి పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని గౌరవిస్తూ, ఆయన నిఖార్సైన వైఎస్ఆర్సిపి కార్యకర్త కావడంతో, బియ్యపు కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహంపై వైఎస్ఆర్సిపి జెండాను కప్పి పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాయి మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం మన అందరి దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం సాయి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. బియ్యపు కుటుంబం మీకు అన్ని విధాల అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.
తదనంతరం సాయి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయంగా పాడె మోసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో
దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసలు
పసల రామచంద్రయ్య,పసల కమలాకర్, పసల వసంత్,పసల సురేష్, సిఆర్టి ప్రసాద్, నక్క మనోహర్,నక్క రమణ, నక్క శేఖర్, పసల శివ, పసల గోవర్ధన్,పసల గణేష్ ,సాయి రామ్,ముని రాజా,సుమతమ్మ, యుగంధర్,బుల్లెట్ జైశ్యామ్ రాయల్, బుడ్డ కిశోర్,చైతు, భాను, కళ్యాణ, ధ్యాని,మున్నా రాయల్, ముద్దుమూడి రవి, శ్రీవారి సురేష్ తదితరులు ఉన్నారు.