chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:01 am Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీకాళహస్తి దేవస్థానానికి యూనియన్ బ్యాంక్ వారు ఎమ్మెల్యే చేతుల మీదగా  డిజిటల్ స్కానర్ మిషన్ల వితరణ

శ్రీకాళహస్తి , చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 15
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల దర్శన సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ స్కానర్ మిషన్లను దేవస్థానానికి అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాసులు, డిప్యూటీ జనరల్ మేనేజర్ సూర్యప్రకాశ్, రీజినల్ హెడ్ సోమంచి శర్మ, మేనేజర్లు శేఖర్ రెడ్డి, హరికృష్ణలు డిజిటల్ స్కానర్ మిషన్లను దేవస్థాన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డిజిటల్ స్కానర్ సేవలను లాంఛనంగా ప్రారంభించి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేవస్థానానికి డిజిటల్ స్కానర్ మిషన్లను అందించడం అభినందనీయమని, భక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇతర బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి  బి.కె. వెంకటేశులు,శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్,దేవస్థానం పాలక మండలి సభ్యులు , తెలుగు దేశం పార్టీ నాయకులు ,  దేవస్థానం అధికారులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.