
శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 26:
శ్రీకాళహస్తి డివిజనల్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో శనివారం ఎస్.ఐఆర్ ప్రక్రియ పై ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా 168 శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి అధికారులు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమ రేషన్ ఫారాల సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఓటర్ల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకాళహస్తి వెల్లడించారు.జూన్ 15 నుంచి జూలై 24 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మొత్తం 2,49,123 మంది ఓటర్లలో 2,16,287 మంది ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.ఫీల్డ్ వెరిఫికేషన్‌లో భాగంగా 9,144 మంది మరణించిన ఓటర్లు, 14,281 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, 3,357 మంది రెండు చోట్ల ఓటు నమోదైన డూప్లికేట్ ఓటర్లు, 6,015 మంది పలుమార్లు ఇంటికి వెళ్లినా అందుబాటులో లేని (అబ్సెంట్) ఓటర్లు, 39 మంది ఇతర కారణాలకు చెందినవారు గుర్తించబడ్డారు. దీంతో మొత్తం 32,836 మంది ఓటర్ల వివరాలు తొలగింపు పరిశీలన (డిలేష కేటగిరీ ) కోసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా తొలగింపు పరిశీలనకు గుర్తించిన ఓటర్ల సంఖ్య ఇలా ఉంది. శ్రీకాళహస్తి అర్బన్‌లో అత్యధికంగా 12,221 మంది, రేణిగుంటలో 9,083 మంది, శ్రీకాళహస్తి గ్రామీణంలో 4,363 మంది, ఏర్పేడులో 4,047 మంది, తొట్టంబేడులో 3,122 మంది ఉన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటూ, తదుపరి దశల్లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, పరిశీలన అనంతరం తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.