chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 8:07 am Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీకాళహస్తిలో ఆన్‌లైన్ టికెట్ విధానం పై జనసేన వినతి పత్రం

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 09:

 

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆన్‌లైన్ టికెట్ పద్ధతి వల్ల భక్తులు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల పై జనసేన నాయకులు ఆలయ కార్యనిర్వాహణాధికారి బి.కే వెంకటేసులు,శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేవస్థానంలో టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతి ద్వారా మాత్రమే తీసుకునే అవకాశం ఉండడంతో యాప్ పని చెయ్యని కారణంగా భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లు ఉపయోగించడం తెలియని భక్తులు, స్మార్ట్ ఫోన్ లేని వారు, మొబైల్ ఫోన్‌లు దేవాలయంలోకి తీసుకుని రాని వారు ఈ ఆన్‌లైన్ పద్ధతి వల్ల గందరగోళానికి గురవుతున్నారు. పూర్తిగా డిజిటలైజ్ చెయ్యాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మంచిదే అయినప్పటికీ, విడతలవారీగా ఆన్‌లైన్ పద్ధతి ప్రవేశపెట్టి ఉంటే ప్రజల్లో అవగాహన వచ్చే వరకు ఇబ్బంది లేకుండా ఉండేదని ఈసందర్భంగా జనసేన నాయకులు దేవస్థానం ఈవో, చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈవో, చైర్మన్  సానుకూలంగా స్పందిస్తూ ఈ ఇబ్బందులను దేవాదాయశాఖ దృష్టికి తీసుకువెళ్ళి వీటికి తక్షణమే పరిష్కారం చూపెట్టడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయప్రకాష్, కుమార్, మహేష్, డిల్లీ బాబు, చిరంజీవి, రఘు, గిరి, లీలాధర్, నారాయణ, రాఘవ తదితరులు పాల్గొన్నారు.