chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 7:30 am Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో  శ్రీరామనవమి వేడుకలు  అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం 

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 27:

 

ఎస్ఆర్ పురంమండలం సింధూరాజ పురంలో వెలసిన శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో బెంగుళూరు నుంచి వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. ఉదయం నుంచి అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాగి మాను మరియు వేపమానులకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సీతారాముల కళ్యాణానికి గీతాశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామి,ఆలయ స్థాపతి విశ్వరూప చారి, ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు వివిధ ప్రవచనాలు బోధించారు అని ఆలయ పురోహితులు ప్రసాద్ శర్మ హరి స్వామి తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అలాగే స్వామివారిని గ్రామ ఉత్సవం నిర్వహించారు. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి ఉభయదారులుగా గజేంద్ర నాయుడు నీరజ వ్యవహరించారు. అలాగే ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు, బిల్డర్ గంగాధరం, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు, రమేష్ నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.