
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 22:
కుప్పంలో వ్యాయామ విద్యఉపాధ్యా యులకు అవసరమైన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీఎస్ఏపీ ఈ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ చైర్మన్ అంబా మహేష్, కుప్పం మండల విద్యాశాఖ అధికారి రాజారామ్,నోడల్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ బాబు, నమూనా పాఠశాల ప్రధానాచార్యుడు వినయ్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా పరీక్షలకు సంబంధించిన రికార్డు పుస్తకం, దినచర్య పుస్తకం, సెలవు దరఖాస్తు పుస్తకాలను ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్ర మంలో మాట్లాడుతూ.. అంబా మహేష్ వ్యాయామ విద్యాభివృద్ధికి ఈ చర్యలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ పుస్తకాల పంపిణీ ద్వారా ఉపాధ్యాయు లకు సౌలభ్యం కలుగుతుందని, వ్యాయా మవిద్య మరింత బలోపేతం అవుతుంద ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్, హరినాథ్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పుష్ప,షబ్బీరా,హరిత, సుధాకర్,సబితా,గుణమ్మ,కిరణ్ కుమార్,మునికృష్ణ నాయక్,విజయ్, మురళి తదితరులు పాల్గొన్నారు.అనం తరం లయన్స్ క్లబ్ చైర్మన్, మండల విద్యాశాఖఅధికారి,ప్రధానోపాధ్యాయుడు, ప్రధానాచార్యులను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.