chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 12:39 pm Digital Edition : CHITTOORE EXPRESS

వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శిగా  ఎం.శరవణన్ ఏకగ్రీవ ఎన్నిక

చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 17:

 

చిత్తూరు సర్కిల్ పరిధిలోని వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ (H-128) కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. డిస్కమ్ నాయకుడు శ్రీ బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ బలోపేతం, విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రానున్న కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా చిత్తూరు సర్కిల్ నూతన ప్రాంతీయ కార్యదర్శిగా ఎం. శరవణన్ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన శరవణన్‌కు యూనియన్ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. సమావేశం అనంతరం డిస్కమ్ నాయకుడు బాలాజీ, చిత్తూరు ఆపరేషన్ డివిజనల్ నాయకులు, చిత్తూరు రూరల్ డివిజన్ నాయకులు, యూనియన్ ప్రతినిధులు కలిసి చిత్తూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ప్రాంతీయ కార్యదర్శిగా ఎన్నికైన ఎం. శరవణన్ నియామక పత్రాన్ని సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యదర్శికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ఉద్యోగుల హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.