chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:35 am Digital Edition : CHITTOORE EXPRESS

వెదురుకుప్పంలో వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:

 

వెదురుకుప్పం మండలకేంద్రంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి బాణసంచాపేల్చుతూ ఆనం దోత్సాహాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రజల కు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భం గా మోహన్ మురళి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నిత్య కృషీవలు డిగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ఆయన చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు అభినంద నీయమని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి చెంగల్రాయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి,సింగల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి,ఏఎంసి ఉపాధ్యక్షుడు దేవరాజుల నాయుడు, ఇతర కూటమిపార్టీల మండల నాయకు లు,క్లస్టర్ కన్వీనర్లు,కో-కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.