
వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 29:
వి.కోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దారుణంగా హత్యకు గురైన జగన్మోహన్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చుతూ వారికి న్యాయం తప్పక జరుగుతుందని, తామంతా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. విలేఖరిపై జరిగిన ఈ దారుణ హత్య చాలా బాధాకరమని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు. పలమనేరు నియోజకవర్గం అనుభవం, నిజాయతితో పనిచేసిన విలేఖరిని కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య ఘటనలో గాయపడిన మరో విలేఖరి మణిని కూడా పరామర్శించి జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాంబాబు, రంగనాథ్, ధీరజ్, నారాయణ స్వామి, మురుగేష్, శభరీష్, హరి తదితరులు పాల్గొన్నారు.