chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 12:42 pm Digital Edition : CHITTOORE EXPRESS

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలని వినతి

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 31:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కొలమడుగు గ్రామపంచాయతీ పరిధిలో ని కదిరిముత్తనపల్లె గ్రామానికి చెందిన 10మంది విద్యార్థులు ప్రతిరోజూ సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని మఠం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఎంపీడీఓ ఏ.పి.ఆర్. కుమార్‌ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ సహకారంతో ఆటో డ్రైవర్లతో మాట్లాడి విద్యార్థులకు రోజువారీ రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ సహకారంతో ఒక్కో విద్యార్థికి నెలకు రూ.500 రవాణా చార్జీలుగా అందజేస్తా మని తెలిపారు. అనంతరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీవైఎంపీడీఓ రవి నాయక్, పంచాయతీ అభివృద్ధి అధికారి త్యాగరాజు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.