
విజయవాడ,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై 18:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంస్థాగత రాజకీయ సదస్సు శనివారం విజయవాడలోని ఐ.వి. ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో జరిగిన ఈ సదస్సుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ సంస్థాగత కార్యక్రమ కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుడు రీతేష్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ జీ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సంస్థాగత బృందం సభ్యులు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల బీఎల్‌ఏ–1లు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎన్.ఎస్. తులసినాథ్తో పాటు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సదస్సులో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, రాబోయే ఎన్నికలకు కార్యాచరణ, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సదస్సు విజయవంతంగా నిర్వహించబడగా, రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.