chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:03 pm Digital Edition : CHITTOORE EXPRESS

విఘ్నేశ్వరుడికి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదానం కార్యక్రమం

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 15:

 

శ్రీకాళహస్తి: వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని భాస్కరపేటలో శ్రీ విజయ గణపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలోని రావి, వేప చెట్లకు భక్తిశ్రద్ధలతో కళ్యాణం నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పులి రామచంద్ర, అప్పిని సుధాకర్, పులి హేమసుందర్, పులి రాజా, ఈశ్వరయ్య, మోహన్ కృష్ణ, జగదీష్, బండారు రవి తదితరులు పాల్గొన్నారు.