
ఎస్.ఆర్.పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 02:
ఎస్.ఆర్.పురం మండలంలోని క్షీరసముద్రం చెరువులో విబి రాంజీ పథకం కింద చేపట్టిన పనులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పీడీ రవికుమార్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి బలపడితేనే వికసిత భారత్ సంకల్పం సాకారమవుతుందని పేర్కొన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగానని, రైతులు, కూలీల సమస్యలపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. అనంతరం గడ్డపారతో పనులు చేసి శ్రామికులకు ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, జిల్లా టీడీపీ నాయకుడు రాజశేఖర్ నాయుడు, సహకార సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎంపీడీవో వనజ, ఏపీవో లలిత, ఆరిమాను గంగమ్మ ఆలయ చైర్మన్ జలంధర్ నాయుడు, బాలాజీ నాయుడు, వాసు నాయుడు, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్, నోమేష్ రెడ్డి, పైనేని ధనుంజయ నాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్లు రేఖ, శకుంతల, జ్యోతి, గురుదేవ, లోకయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు