chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:57 am Digital Edition : CHITTOORE EXPRESS

రౌడీ షీటర్లు,సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్..  నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు :  సీఐ జయచంద్ర

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 21:

 

రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు,సస్పెక్ట్ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రేణిగుంట ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. జయచంద్ర పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎటు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడ కుండా క్రమశిక్షణతో జీవించాలని సూచించారు.గొడవలు,బెదిరింపులు,భూ వివాదాలు,గంజాయి ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి మంచి పౌరులుగా జీవించాలని, యువతను కూడా చెడు మార్గాల వైపు వెళ్లకుండా ప్రోత్సహించాలని సూచించారు. రేణిగుంట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని,అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.