chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:31 am Digital Edition : CHITTOORE EXPRESS

రౌడీ షీటర్లు,అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించిన రేణిగుంట సీఐ జయచంద్ర

రేణిగుంట శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేణిగుంట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు, అనుమా
నిత వ్యక్తులకు సీఐ జయచంద్ర కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట సీఐ జయచంద్ర మాట్లాడుతూ, నేరాలకు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ కుటుంబ సభ్యుల గౌరవాన్ని నిలబెట్టేలా
మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు. అంతేకాకుండా శాంతి భద్రతలకు భంగం
కలిగించే చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. నేరాలకు దూరం
గా ఉండి సమాజంలో ఆదర్శంగా నిలవాలని రౌడీ షీటర్లు, అనుమానితులకు సీఐ జయ చంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.