
రేణిగుంట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు06:
అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపును అరికట్టే చర్యల్లో భాగంగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్. జయచంద్ర గురువారం రేణిగుంట రైల్వే పార్శిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సంద ర్భంగా పార్శిల్ బుకింగ్ విధానం, పార్శిళ్ల పరిశీలన ప్రక్రియ, నిర్వహణ రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిం చారు. అనుమానాస్పద పార్శిళ్లు,మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర నిషేధిత వస్తువులు రవాణా కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాల ని పార్శిల్ కార్యాలయ సిబ్బందికి సీఐ జయచంద్ర సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా పార్శిళ్లు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో రైల్వే సిబ్బంది తో పాటు ప్రజల సహకారం కూడా కీలకమని ఆయన పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని,చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ జయచంద్ర హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీలతో రైల్వే పార్శిల్ కార్యాలయం లో భద్రతా చర్యలు మరింత పటిష్ఠమయ్యాయి.