
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,సెప్టెంబర్ 09:
పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 7వ సౌత్ జోన్ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ 2026–27లో రేణిగుంట రైన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. జూనియర్ బాలుర 47–51 కిలోల విభాగంలో టి. రిషి కిరణ్ రెడ్డి బంగారు పతకం సాధించగా, ప్రీ-టీన్ 26–28 కిలోల విభాగంలో సి. జ్ఞానేశ్వర్, ప్రీ-జూనియర్ 43–45 కిలోల విభాగంలో ఏ.వి. జెశ్వంత్ రెడ్డి వెండి పతకాలు సాధించారు. జూనియర్ 39–43 కిలోల విభాగంలో ఎం.డి. ఖలీద్, ఎం.డి. రిహాన్ కూడా పోటీల్లో పాల్గొన్నారు.విద్యార్థులు క్రమశిక్షణ,పట్టుదల,నైపుణ్యం, పోరాట స్ఫూర్తితో పోటీల్లో రాణించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కరస్పాండెంట్ పి.ఏ.ఖాన్ విజేతలను అభినందిస్తూ, క్రీడలతో పాటు విద్యలోనూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు,క్రీడా బృందం, కోచ్ల కృషి అభినందనీయమన్నారు.ప్రిన్సిపాల్ ఎస్.కె. షాహెర్ బాను విజేతలను అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ,పట్టుదల,జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. భవిష్యత్ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.