chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 5:51 am Digital Edition : CHITTOORE EXPRESS

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి..

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 02 :

 

రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్-1లోని పురుషుల జనరల్ వెయిటింగ్ హాల్‌లో సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ బి. మధుసూదనరావు తెలిపారు. మృతుడు తెలుపు రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, గ్రే రంగు ప్యాంట్ ధరించి ఉండగా, చేతికి బంగారు రంగు సోనాటా చేతి గడియారం ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే జీఆర్‌పీ రేణిగుంట పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్‌ఐ బి. మధుసూదనరావు కోరారు. మృతుడి వివరాలు తెలిసిన వారి సమాచారంతో కుటుంబ సభ్యులను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.