
రేణిగుంట, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 22 :
తిరుపతిజిల్లా రేణిగుంట పట్టణంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలుగుదేశంపార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్క రించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యం లో జామ్ జామ్ హోటల్ సర్కిల్ వద్ద పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలు నాటారు. అనంతరం అక్షయ క్షేత్రంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. జన్మదిన వేడుకల ను ఆర్భాటంగా కాకుండా సమాజానికి ఉపయోగ పడే విధంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమా లు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొ న్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణం గా సేవా కార్యక్రమాలు నిర్వహిం చడం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం సీనియర్ నాయకులు పుష్ప నాదం,వెంకట ముని రెడ్డి,ముస్లిం మైనార్టీ నాయకుడు నవాబ్, బాబు,సంపత్, గజేంద్ర,యువ నాయకుడు,బూత్ ఇన్‌చార్జ్ కిరణ్, సాగర్, నెల్లూరు సుబ్రహ్మణ్యం, జయ,హామీద్, ప్రభు,వంశీ, తెలుగు దేశం పార్టీ నాయకులు,వార్డు ఇన్‌చార్జీలు,యువ నాయకు లు,మహిళా నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.