
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 01:
రేణిగుంటలోని రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో శనివారం “జెన్‌నెక్స్ట్ ఇన్నోవేటర్స్ 2026” సైన్స్ ఎక్స్‌పోను విజయవంతంగా నిర్వహించారు.ఈ ఎక్స్‌పోలో విద్యార్థులు భౌతిక శాస్త్రం,జీవ శాస్త్రం,గణితం మరియు రోబోటిక్స్ రంగాలలో రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.విద్యార్థులు తమ ప్రాజెక్టులను ధైర్యంగా వివరిస్తూ శాస్త్రీయ అవగాహన,సృజనాత్మకత మరియు పరిశోధనా నైపుణ్యాలను చూపించారు.తల్లిదండ్రులు భారీగా హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మరియు ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి షెహర్ భాన, కరస్పాండెంట్ పి అత్తాఉల్లా ఖాన్ విద్యార్థులను అభినందించి,కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రుల ప్రశంసల మధ్య విజయవంతంగా ముగిసింది.