chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:14 am Digital Edition : CHITTOORE EXPRESS

రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి & సంక్షేమం కార్యక్రమంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 29:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న “రెండు సంవత్సరాల నమ్మకం – అభివృద్ధి & సంక్షేమం” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని క్లస్టర్-10, 20వ వార్డులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 20వ వార్డు పరిధిలోని బూత్ నెం.167లో ఇంటింటికీ వెళ్లిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కూటమి ప్రభుత్వ పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్, 20వ వార్డు కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్, 20వ వార్డు బూత్ ఇన్‌చార్జ్‌లు కే. లోకేష్ బాబు, వి.కె.ఎం. రాజా, కరుణ, సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.