
వి.కోట,చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 01:
వి.కోట మండలం గోవిందాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.యుక్తి రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపికైంది. చిత్తూరులోని బీఎస్ కన్నన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సేవా–సంకల్ప్ అభియాన్ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా యుక్తిని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎంఈఓలు చంద్రశేఖర్, మురుగేష్ ఆమెను అభినందించారు.