శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి13:
రాళ్ళబూదుగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదవ తరగతి విద్యార్థులు సరస్వతీ దేవి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు,రెస్కో డైరెక్టర్ ఎస్ బసవరాజు దంపతులు పాల్గొని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన పెన్నులు,ప్యాడ్లు, జామెంట్రీ బాక్సులను అందజేసి పరీక్షలు వ్రాసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలసి పూర్వ విద్యార్థులను దుశ్యాల వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ ప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఆంగ్ల బోధన ఉపాధ్యాయురాలు వనజాక్షి,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.