chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 10:55 pm Digital Edition : CHITTOORE EXPRESS

రాళ్లబుదుగూరులో గృహప్రవేశ వేడుకలు లబ్ధిదారులకు ఇళ్ల తాళాల పంపిణీ  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ 

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి30:

 

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్లబుదుగూరు గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, పి.కె.ఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబులు హాజరై లబ్ధిదారులైన గౌరమ్మ, గంగులప్పలకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం వారి సొంతింటి కలను నిజం చేసుకొని, సుఖంగా జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గూడు లేని నిరుపేదలను గుర్తించి వారికి సొంత నివాసాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలను ప్రారంభించిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిపురం మండల టిడిపి అధ్యక్షులు నందిగామ ఉదయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.