chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:08 am Digital Edition : CHITTOORE EXPRESS

రామేగాని పల్లిలో ‘వి.బి.జి రామ్ జి’ కార్యక్రమం ప్రారంభం

శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 02:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రాళ్లబుదుగూరు గ్రామపంచాయతీ పరిధిలోని రామేగాని పల్లిలో గురువారం ‘వి.బి.జి రామ్ జి’ (వికసిత్ భారత్ గ్రామీణ్ రూరల్ ఎంప్లాయిమెంట్) కార్యక్రమాన్ని యూనిట్ ఇన్‌చార్జి ఆర్.ఎస్. మణి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆర్.ఎస్. మణి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి పథకాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగ అవకాశాల పై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న యువత, మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.