chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:27 am Digital Edition : CHITTOORE EXPRESS

రాజేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీఎస్ మునిరత్నం

శాంతిపురం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్15:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండల యువ నాయకుడు, మాజీ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు, శాంతిపురం క్లస్టర్–1 ఇన్‌చార్జ్ జి.ఎన్. రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పీఎస్ మునిరత్నం సోమవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు సహాయం అందిస్తూ సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అవసరమైన వారికి అండగా నిలుస్తూ, పదిమందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే నాయకత్వ లక్షణాలు రాజేంద్ర ప్రసాద్‌లో ఉన్నాయని అన్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ నాయకులు, శాంతిపురం మండల నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొని రాజేంద్ర ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.