chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:32 pm Digital Edition : CHITTOORE EXPRESS

రమ్య–కావ్యలకు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు భరోసా ఉన్నత విద్యకు అండగా ఉంటా.. భవిష్యత్తుకు భరోసా ఇస్తా

 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 15:

 

చిత్తూరుజిల్లా కుప్పంనియోజకవర్గం శాంతిపురంమండలం కడపల్లి పంచాయతీ మాదనపల్లి ఎస్సీ దళితవాడకు చెందిన రమ్య–కావ్యలను పరామర్శించేందుకు వెళ్లిన ఎంఆర్ పిఎస్, బహుజన సేన నాయకుల ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఫోన్‌లో వారితో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ధైర్యం చెప్పి, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. “మీ ఉన్నత విద్యకు నా వంతు సహకారం అందిస్తా.. ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహాయాన్ని కూడా అందేలా చూస్తా. ఎలాంటి ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి పెట్టండి” అని ఎంపీ ప్రసాదరావు భరోసా ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కష్టాల్లో ఉన్న రమ్య–కావ్యలను స్వయంగా ఫోన్‌లో పరామర్శించి వారి భవిష్యత్తుకు అండగా ఉంటాన ని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. రమ్య – కావ్యల చదువు ఆగిపోకుండా సమాజం మొత్తం అండగా నిలవాలని ఎంఆర్ పిఎస్, బహుజన సేన నాయకులు కోరారు. వారి ఉన్నత విద్యకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యాపరమైన అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాల ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ పిఎస్ కుప్పం నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ వెంకటేష్ మాదిగ, సీనియర్ నాయకులు గోవిందప్ప మాదిగ, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎంపీ ప్రకాష్ మాదిగ, బాలచంద్రబాబు, బహుజన సేన కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహేష్ కుమార్, రామకుప్పం మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.