రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి13 :
రేణిగుంట మిరియాల బాబా గౌసియా ఆశ్రమం లో హజరత్ మౌలాలి స్వామి గంధోత్సవాన్ని గౌసియా ఆశ్రమ పీఠాధిపతి ఆం.ప్ర రాష్ట్ర మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఖ్వాజా జుబేర్ హాయాత్ అలీ షా ఖాదరీ ఘనంగా నిర్వహించారు. ఇస్లాం మత సన్మార్గాన్ని భావి మానవ జాతి ఉద్ధరణ కోసం హజరత్ మౌలాలి స్వామి తన ప్రాణాలను త్యజించి అమరులైనారని పీఠాధిపతి తెలియచేశారు. అటువంటి మహనీయుని షహదత్ అమరత్వం పొందిన నాటిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గౌసియా ఆశ్రమం లో హజరత్ మౌలాలి స్వామి పేరిట పతాకాన్ని ఆవిష్కరించి, పవిత్ర ఖురాన్ పఠనం తో ఫాతెహ నిర్వహించి విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ మషాయక్ అసోసియేషన్ రేణిగుంట అధ్యక్షులు రైటర్ మహబూబ్ బాషా, మిరియాల బాబా ఆధ్యాత్మిక శిష్యులు సత్తార్ ఖాదరీ, సుభాన్ ఖాదరీ, బాలాజీ, కరీముల్లా, తిరుపతి నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.