రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి04:
రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనపై సీఐ జయచంద్ర బుధవారం వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రకటన లో పేర్కొన్న వివరాల ప్రకారం, బాలికకు పరిచయమున్న వ్యక్తి మాయమాటలు చెప్పి, బెదిరింపులకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించబడింది. బాధిత బాలిక ప్రస్తుతం తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం, సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.కేసును విచారించి బాధితురాలికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ జయచంద్ర వెల్లడించారు. విచారణ ప్రయోజనాల దృష్ట్యా నిందితుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.