chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 8:15 am Digital Edition : CHITTOORE EXPRESS

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ వైసీపీ రిలే దీక్షలు

హిందూపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు06:

 

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా గురువారం హిందూపురం, పరిగి ప్రాంతాల్లో మొదటి రోజు దీక్షలు ప్రారంభమయ్యాయి. హిందూపురం పట్టణంలోని సద్భావన సర్కిల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి దీపికా వేణు రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. అదే విధంగా పరిగి మండల కేంద్రంలోని పోస్టాఫీస్ సమీపంలో వైసీపీ పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రిలే దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పరిగి ఎంపీపీ సవిత ప్రభాకర్‌తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హిందూపురంలో నిర్వహించిన దీక్షకు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి, సీనియర్ నాయకుడు వేణు రెడ్డి, రూరల్ ఎంపీపీ రత్నమ్మ, ఎంపీటీసీ కృష్ణవేణి, స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరై సంఘీభావం తెలిపారు.