chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:55 pm Digital Edition : CHITTOORE EXPRESS

మున్సిపల్ కౌన్సిలర్ కస్తూరి వేలు తన జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్‌లో అన్నదానం

 

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 24 :

 

 

 

కుప్పం మున్సిపల్ కౌన్సిలర్, అన్నా క్యాంటీన్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ కస్తూరి వేలు తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. కుప్పం పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో మంగళవారం ఒకరోజు భోజనాన్ని ఆమె నిరుపేదలకు అందించారు. క్యాంటీన్‌కు వచ్చిన పేదలకు ఉచితంగా భోజనం అందించి వారి ఆకలి తీర్చారు. ఈ సేవా కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ అడ్వైజర్, అన్నా క్యాంటీన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అంబ మహేష్, అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పరిశీలించి వేలు కస్తూరి కుటుంబాన్ని అభినందించారు. పుట్టినరోజు వంటి శుభసందర్భాలను పేదల సేవకు వినియోగించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనారిటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జాకీర్ అహ్మద్, లయన్స్ క్లబ్ సభ్యులు సెల్వం, టిడిపి నాయకులు జయరామ్ నాయుడు, రామచంద్ర వేడి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అన్నా క్యాంటీన్ సూపర్‌వైజర్ మంజు, క్యాంటీన్ సిబ్బంది. కార్యక్రమం నిర్వహణలో సహకరించారు. ఈ సందర్భంగా కస్తూరి వేలు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని క్యాంటీన్‌కు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి, తమ పుట్టినరోజు వేడుకలను పేదలతో కలిసి చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.