chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 9:44 pm Digital Edition : CHITTOORE EXPRESS

ముద్రగడ పద్మనాభంకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి కాపు–దళితుల ఐక్యతకు కృషి చేసిన మహోన్నతుడని కొనియాడిన నాయకులు

కడప,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 15:

 

కాపు, దళితుల ఐక్యత కోసం నిరంతరం కృషి చేసిన ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడి పనిచేసిన మహోన్నత వ్యక్తి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలుపుతూ నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఆయనతో తమకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూ, పదవుల కంటే ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. కాపు సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, అలుపెరగని పోరాటం చేసిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ పాక సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి, ఏ–వన్ అంబులెన్స్ అధినేత నాగరాజు, 44వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి, పులి సునీల్ కుమార్ తదితరులు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.