chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:37 am Digital Edition : CHITTOORE EXPRESS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 04:

 

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గురువారం అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణం రూరల్ మండలానికి చెందిన మొత్తం 7 మంది లబ్ధిదారులకు రూ.4,56,113 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జి. విజయకుమార్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, కాసారం రమేష్, పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.