కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 14:
కుప్పం ప్రాంతానికి చెందిన 12వ క్లస్టర్ ఇంచార్జ్ ఎం.రోహిత్ కుమార్ తన వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రాష్ట్ర రాజధానిలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రోహిత్ కుమార్‌ను ఆప్యాయంగా పలకరించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. అయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. తన వివాహానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ పాల్గొన్నారు.