chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 11:02 pm Digital Edition : CHITTOORE EXPRESS

ముఖ్యమంత్రితో సమావేశమైన కుప్పం నియోజకవర్గ నాయకులు క్లస్టర్ 10కు తొలి స్థానం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 06:

 

విజయవాడలోకుప్పం నియోజకవర్గ నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన క్లస్టర్-10 నియోజకవర్గ స్థాయిలో మొదటి స్థానం సాధించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా క్లస్టర్-10 ఇంచార్జ్, 20వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్ మాట్లాడుతూ, ఈ విజయానికి సహకరించిన పార్టీ పెద్దలు, క్లస్టర్ అధ్యక్షులు, కో-క్లస్టర్ యూనిట్ సభ్యులు, యూనిట్, బూత్, కో-బూత్ ఇన్‌చార్జ్‌లు, కౌన్సిలర్లు, కుప్పం మున్సిపాలిటీ డైరెక్టర్లు, అలాగే మహిళా విభాగం సభ్యులు, టిడిపి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మన అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో అందరి సమిష్టి కృషి కీలక పాత్ర పోషించిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యంగా పనిచేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశం కుప్పం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.