chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:05 am Digital Edition : CHITTOORE EXPRESS

ముక్కంటి సేవలో పరిటాల సునీత

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 11:

 

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు మాజీ మంత్రివర్యులు , శాసన సభ్యురాలు పరిటాల సునీత శుక్రవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద ఆలయ కార్యనిర్వాహణాధికారి బికె వెంకటేశులు వారిని స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి వేదపండితులచే ఆశీర్వదించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి, గోపీనాథ్ ట్రస్ట్ బోర్డు, లక్ష్మమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు శైలజ , ప్రోటోకాల్ ఏ ఈ ఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, పీఆర్ఓ రవి, తెలుగుదేశంపార్టీ నాయకులు ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు.