chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 9:04 am Digital Edition : CHITTOORE EXPRESS

మిరియాల బాబా గౌసియా ఆశ్రమం విచ్చేసిన హై కోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు విచ్చేసిన ప్రముఖులను సన్మానించి పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ 

 

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 11:

 

మిరియాల బాబా గౌసియా ఆశ్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసు రాజు, హై కోర్టు న్యాయవాది షేక్ బాజీ, బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, తిరుపతి జిల్లా బీజేపీ మైనారిటీ అధ్యక్షులు ఎస్ మస్తాన్ విచ్చేసారు. వారిని ఆశ్రమ పీఠాధిపతి ఆంధ్ర ప్రదేశ్ మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ, ఆశ్రమ ట్రస్టీలు ఘనంగా స్వాగతం పలికారు, పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ ఖాదరీ ప్రత్యేక ఫాతెహా నిర్వహించి వారిని ఆశీర్వదించి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. విచ్చేసిన ప్రముఖులు ఆశ్రమాన్ని కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నందుకు పీఠాధిపతి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ మషాయక్ అసోసియేషన్ రేణిగుంట అధ్యక్షులు రైటర్ మహబూబ్ బాషా, ఆశ్రమ శిష్యబృందం సత్తార్ ఖాదరీ, జిలానీ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.