chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:31 am Digital Edition : CHITTOORE EXPRESS

మన్నేముత్తేరిలో మదిలేటి అమ్మవారి పొంగళ్ల ఉత్సవాలకు అంకురార్పణ

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 24:

 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరి గ్రామం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న మదిలేటి అమ్మవారి పొంగళ్ల ఉత్సవాల కు ఆదివారం ఘనంగా అంకురార్పణ జరిగింది. ఉత్సవాల ప్రారంభంతో గ్రామ మంతా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి పోయింది. ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. గ్రామ పొలిమేరల వరకు వేపాకు తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వీధుల గుండా ఊరే గింపుగా తిరుగుతూ తొలిరోజు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం అమ్మవారికి అంబళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తిశ్రద్ధల తో మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయాయి. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈసారి పొంగళ్ల ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వ హించేందుకు గ్రామపెద్దలు, యువకులు, మహిళలు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు, గ్రామ దేవత ఊరేగింపులు నిర్వహించనున్నట్లు నిర్వా హకులు వెల్లడించారు. మన్నేముత్తేరి గ్రామంలో ప్రారంభమైన ఈ ఉత్సవాల సందడి కారణంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.